- Advertisement -
సినీ కార్మికుల ఫెడరేషన్‌కు లేబర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఫెడరేషన్‌కు సంబంధించిన కీలక వివరాలు ఇవ్వాలని ఈ నోటీసుల్లో లేబర్ కమిషన్ పేర్కొంది. కార్మికుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు ఫీజులు, ఇప్పటి వరకు అందుకున్న చందాల వివరాలు పూర్తిగా సమర్పించాలని ఈ నోటీసుల్లో కార్మిక శాఖ తెలిపింది. సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని ఆగస్టు 4వ తేదీ నుంచి కార్మికుల ఫెడరేషన్ సమ్మెలో పాల్గొంటుండగా టాలీవుడ్‌లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల షూటింగ్ నిలిచిపోయాయి. పలుమార్లు నిర్మాతల మండలి, ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవి కొలిక్కి రాలేదు. అయితే, గురువారం మరోసారి నిర్మాతల మండలి, ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతుండగా ఫెడరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కోరుతూ లేబర్ కమిషన్ నోటీసులు జారీ చేయడం విశేషం.
- Advertisement -