మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి ఐలాండ్ అభివృద్ధి పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టనున్నారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్/యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం కింద అమరగిరిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అచ్చంపేట మండలం ఈగలపెంట వద్ద చెంచు మ్యూజియం, అరైవల్ జోన్ ప్రొమెనేడ్, రివర్ క్రూజ్ నోడ్, ఇతర పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఉదయం 10 గంటలకు అమరగిరి దీవిలో వెల్‌నెస్ రిట్రీట్‌కు శంకుస్థాపన, 11 గంటలకు సోమశిల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, 11.45 గంటలకు యంగంపల్లి తండా, పెంట్లవెల్లి మండలం అంగన్వాడి భవనం నిర్మాణానికి శంకుస్థాపన, మధ్యాహ్నం 12.15 గంటలకు పెంటక్లవెల్లి గ్రామంలో పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ రహదారి శంకుస్థాపన, 12.30 గంటలకు యేతం గ్రామం, కోడేరు మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా వద్ద పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ రహదారి శంకుస్థాపన, 3.30 గంటలకు ఈగల పెంట గ్రామం అచ్చంపేట మండలం వద్ద చెంచు మ్యూజియం, అరైవల్ జోన్, ప్రోమెనేడ్, రివర్ క్రూజ్ నోడ్, ఇతర పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.