Friday, August 22, 2025

ఉక్రెయిన్‌పై 574 డ్రోన్లు, 40 క్షిపణులతో రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

ఒకవైపు మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలికే దౌత్యప్రయత్నాలు ఇటీవల జరిగినప్పటికీ గురువారం రష్యా 574 డ్రోన్లు, 40 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడిచేసింది. ఈ దాడుల్లో ఒకరు చనిపోగా, 15 మందికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జరిగిన మూడో అతి పెద్ద దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. దాడులు చాలా వరకు ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోనే జరిగాయి. ఎందుకంటే అక్కడే పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు సమకూర్చిన మిలిటరీ సామాగ్రిని నిలువచేశారు. ఉక్రెయిన్‌లోని మిలిటరీ-ఇండస్ట్రీయల్ సైట్లపైనే దాడిచేశామని, పౌర ప్రాంతాలపై దాడిచేయలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

హంగరీ సరిహద్దులో ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ను కూడా రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయని ఉక్రెయిన్‌లోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆండీ హండర్ తెలిపారు. ఉక్రెయిన్‌లో అమెరిక పెట్టిన అతిపెద్ద కర్మాగారం ‘ది ఫ్లెక్స్ ఫ్యాక్టరీ’. ఉక్రెయిన్‌లో అమెరికా వ్యాపారాన్ని రష్యా దెబ్బతీస్తోందని హండర్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా మాస్కో ప్రమేయం లేకుండా ఉక్రెయిన్‌లో భద్రతా ఏర్పాట్లు చేయడం తమకు ఆమోదం కాదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ బుధవారం ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్‌ఐఎ నోవోస్తీకి తెలిపారు. ఇదిలావుండగా సోమవారం ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో జెలెన్సీ సమావేశం అయినప్పుడు ‘పుతిన్ చెప్పినట్లు ఉక్రెయిన్ యుద్ధరంగం పరిస్థితి అంత ఘోరంగా ఏమిలేదు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News