మన తెలంగాణ / హైదరాబాద్ : ఇంజినీరింగ్, వృత్తివిద్యా కాలేజీల్లో ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కళాశాలలు అందించే అకౌంట్స్‌తో పాటు ఆయా కళాశాల్లో విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఫీ జులు నిర్థారించాలని నిర్ణయించింది. ఈ మేర కు ఫీజుల పెంపునకు సంబంధించిన నిబంధన ల్లో మార్పులు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉ త్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్, వృత్తి వి ద్యా కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నిషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చె ల్లింపులు సహా విద్యార్థులను పరిశోధనలవైపు ప్రోత్సహిస్తున్నారా అనే అంశాల్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాలేజీ లు నాణ్యమైన విద్య అందిస్తున్నాయా? ఆ కాలేజిల్లో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నా యి? అనే అంశాలపైనా
దృష్టి సారించనుంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, ప్రభుత్వ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాలను పరిశీలించిన తర్వాతే కళాశాలల్లో ఫీజులను నిర్ధారించనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు నిబంధనలకు సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోధనా ప్రమాణాలు, నిబంధనలు అమలు ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతి ఇచ్చింది. నాణ్యమైన బోధన, ప్లేస్‌మెంట్లు, విద్యార్థుల హాజరు, పరిశోధనలకు ప్రోత్సాహం ఆధారంగా ఫీజుల పెంపునకు పచ్చ జెండా ఊపింది. ఆధార్ ఆధారిత చెల్లింపులు, నిబంధనల అమలు ఆధారంగా ఫీజుల పెంపునకు అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫీజులు పెంచాలని కొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించగా కాలేజీల ఫీజుల నిర్ధారణ కోసం సమర్పించిన ప్రతిపాదనలపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని టీఏఎఫ్‌ఆర్సీకీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, మెంబర్ సెక్రటరీగా ఆచార్య శ్రీరాం వెంకటేష్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలించి సిఫారసులు చేసింది. వీటి ఆధారంగా ఫీజు నిబంధనలకు సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌తో పాటు అన్ని ఉన్నత విద్యా కోర్సులకు గతంలో ఉన్న ఫీజులే అమలు కానున్నాయి. ఎప్‌సెట్ సహా లాసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, ఐసెట్, పీఈసెట్‌ల కౌన్సెలింగ్ గత ఏడాది ఫీజులతోనే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని బట్టి బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీపీఎడ్, డీపీఎడ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు పాత ఫీజులే వర్తించనున్నాయని సమాచారం.