చెన్నై: దంపతులు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలను తీసి.. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఊరపక్కానికి చెందిన భార్యభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో పెరుబక్కం కన్నగినగర్ కు చెందిన ప్రకాశ్(28) చేతిలోకి వచ్చింది. మీ భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు తన దగ్గర వీడియోలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని భార్యను ప్రకాశ్ బెదిరించాడు. ఈ విషయంలో భర్తకు భార్య తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రకాశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉడైయార్ పాళ్యంలో ఉండగా అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఓ మహిళ వీడియో తీసి తనకు ఇచ్చిందని విచారణలో ఒప్పుకున్నాడు. సదరు మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
దంపతులు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి… డబ్బులు ఇవ్వాలని డిమాండ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -