- Advertisement -
బ్లాక్‌బస్టర్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు (Vishnu Manchu) చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ఇక విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా పూర్తి స్థాయి నిర్మాణం, (level construction) ప్రొఫెషనల్ దర్శకత్వం, ఆకట్టుకునే కథ, కథనంతో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట. ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్‌గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఇవే కాకుండా మరి కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం.
- Advertisement -