మార్గన్’ తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ (Bhadrakali)వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘మారెనా’ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. విజయ్ ఆంటోని బ్యూటీఫుల్ లవ్ సాంగ్‌గా కంపోజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన లిరిక్స్ హత్తుకునేలా వున్నాయి. ఈ లవ్ సాంగ్ (Love song) ప్రేక్షకులను అలరిస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలున్నాయి. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
అలరిస్తున్న లవ్ సాంగ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -