వారాహి ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రముఖ నటుడు జెమిని సురేష్ హీరోగా అఖిల నాయర్ హీరోయిన్గా ఆత్మ కథ (Ātma katha) చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, జెమిని కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జెమిని సురేష్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెమిని సురేష్ మాట్లాడుతూ “ఇది హీరోగా నా తొలి చిత్రం. ఒక మంచి కథతో నాకు శ్రీనివాస్ ఆత్మకథ చిత్రంలో అవకాశం ఇచ్చారు”అని అన్నారు. దర్శకులు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ “కథని హీరోగా అనుకుని ఆత్మకథ అనే చిత్రాన్ని రచించాను. ఈ చిత్రంలో జెమిని సురేష్, సమ్మటి గాంధీ రెండు స్తంభాలు వంటి వారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అఖిల నాయర్, సమ్మెట గాంధీ, సంగీత దర్శకులు శ్రేయాస్ తదితరులు పాల్గొన్నారు.
‘ఆత్మ కథ’ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -