- Advertisement -
నిర్మల్: తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా భైంసాలో జరిగింది. బేతి రిశేంద్ర అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. రోజు పది గంటలకు పైగా పబ్జీ గేమ్ ఆడుతూ బానిసగా మారాడు. ఎంతలా బానిసయ్యాడంటే గేమ్ ఆడటానికి సమయం ఉండదని, పదో తరగతిలో చేరడానికి కూడా నిరాకరించాడు. రిశేంద్ర ను సైక్రియాట్రిస్ట్, న్యూరోసర్జన్లకు చూపించారు. తాను గేమ్ ఆడుతానని వైద్యులనే బెదిరించాడు. విద్యార్థి తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఫోన్ లాక్కున్నారు. మనస్తాపానికి గురై రిశేంద్ర ఉరేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -