Friday, August 22, 2025

ఎసిబి వలకు చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్టర్

- Advertisement -
- Advertisement -

ఎసిబి వలకు సబ్ రిజిస్టర్ చిక్కారు. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి అధికా రులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్‌పి ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం- తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉన్న 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదిం చాడు. ఈ సందర్భంగా ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తర్వాత చర్చల అనంతరం రూ.70 వేల వద్ద ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడైన ఆ స్థల యజమాని ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.70 వేల లంచం మొత్తాన్ని డాక్యుమెంట్ రైటర్ రమేశ్ తీసుకుంటుండగా ఎసిబి అధి కారులు పట్టుకున్నారు. విచారణలో అతడు సబ్‌రిజిస్ట్రార్ సూచన మేరకే డబ్బులు స్వీకరించినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఎసిబి అధికారులు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌తో పాటు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News