Saturday, August 23, 2025

24న ‘మదరాసి’ ట్రైలర్, ఆడియో విడుదల

- Advertisement -
- Advertisement -

శివకార్తికేయన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్, చార్ట్ టాపింగ్ ఫస్ట్ సింగిల్ సెలవికాతో మంచి అంచనాలను సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆయనకు కమ్ బ్యాక్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ని ఫుల్ మాస్, ఫియర్స్ లుక్‌లో చూపించనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో శివకార్తికేయన్‌తో పాటు విద్యూత్ జమ్మ్వాల్, బిజు మెనన్, విక్రాంత్‌లను కూడా ఇంటెన్స్ లుక్‌లో చూపించారు. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News