- Advertisement -
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ప్రజాగొంతుక, పీడిత ప్రజల ఆశాజ్యోతి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలోని కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర రావు నగర్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో శుక్రవారం సాంబశివరావును ఎన్నుకున్నారు. ఈ మేరకు సిపిఐ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగూడెం శాసనసభ్యుడిగా ఉన్న సాంబశివరావు ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ మహాసభల సందర్భంగా ఆయనను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -