Saturday, August 23, 2025

సిపిఐ అగ్రనేత సురవరం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎంపి సురవరం సుధాకర్‌రెడ్డి (83) కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జి ల్లా కొండ్రాపల్లి గ్రామంలో 1942 మార్చి 25న ఆయన జన్మించారు. సురవరం సుధాకర్‌రెడ్డి తం డ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సుధాకర్‌రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారు లు. కర్నూల్‌లోని ఉస్మానియా కళాశాల నుంచి బిఎ చేశారు.అనంతరం ఒయు నుంచి ఎల్‌ఎల్‌బి పట్టా పొందారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)లో చేరి దీర్ఘకాలం పార్టీకి సేవలం దించారు. సిపిఐలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1998, 2004 జరిగినఎన్నికల్లో న ల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2012 చేరి దీర్ఘకాలం పార్టీకి సేవలందించారు. సిపిఐలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1998, 2004 జరిగినఎన్నికల్లో న ల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. .సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై తరచూ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, పత్రికా వ్యాసాలు, పుస్తకాలు రాశారు. విప్లవ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, శ్రామిక వర్గాల హక్కుల కోసం పోరాటం చేయడం ఆయన జీవన ధ్యేయంగా ఉండేది. .ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా సిపిఐని నడిపించారు.సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై పలు వ్యాసాలు రాశారు. మార్క్సిస్టు ఆలోచనలను, వామపక్ష దృక్కోణాన్ని స్పష్టంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. నిశితమైన విశ్లేషణ, సరళమైన భాష, ప్రజల పట్ల కట్టుబాటు ఆయన ప్రత్యేకత. తెలంగాణలో వామపక్ష ఉద్యమాల బలోపేతానికి ఆయన కృషి చేశారు. సిపిఐ రాష్ట్ర మహాసభలు ముగిసిన రోజునే సురవరం సుధాకర్‌రెడ్డి మృతి చెందడం ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప నేత : సిఎం రేవంత్‌రెడ్డి
సీపీఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేత గా ఎదిగారని, వామ పక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప నాయకుడని కొనియాడారు. దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని ముఖ్యమంత్రి తన బాధను వ్యక్తం చేశారు.

ప్రజానేత సురవరం : కెసిఆర్
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం ప్రకటించారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ నేతగా తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, మార్క్సిస్టు ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని కెసిఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తెలంగాణ రాజకీయాలకు తీరని లోటు : మహేష్ కుమార్ గౌడ్
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాలకు తీరని లోటని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ భావాలను పునికిపుచ్చుకొని జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నేత సురవరం అని కొనియాడారు. తెలంగాణ కు చెందిన సురవరం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేయడం మనకు గర్వకారణమన్నారు. రెండు సార్లు నల్గొండ ఎంపీగా పని చేసిన సురవరం ప్రజల పక్షపతిగా పేదల అభ్యున్నతి కోసం పని చేసారని గుర్తు చేశారు. ఒక మంచి వామపక్ష భావజాలం ఉన్న నాయకుడిని తెలంగాణ కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఐ అగ్ర నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం మరణించారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ,వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలియజేశారు.

మన తెలంగాణ ఎడిటర్ సంతాపం
సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపై మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ తన సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News