న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబ్రోక్ శివారులో యాత్రికుల బస్సు బోల్తాపడడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడడంతో హెలికాప్టర్లలో వారిని ఆస్పత్రికి తరలించారు. 50 మంది బస్సులో నయాగారా నుంచి న్యూయార్క్‌కు వెళ్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించకపోవడంతో త్వరగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్, చైనా, ఫిలిఫ్పీన్స్‌కు చెందిన యాత్రికులు నయాగారా జలపాతం అందాలను వీక్షించి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఈ ఘటన న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -