హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ ’సుందరకాండ’. (Sundarakanda)నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి అంచనాలు సృష్టించాయి. శుక్రవారం మేకర్స్ ఈ సిని మా నుండి డియర్ ఐరా సాంగ్‌ని రిలీజ్ చేశారు. లియాన్ జేమ్స్ డియర్ ఐరాని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు.
శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ ఎమోషన్ని అద్భుతంగా చూపించాయి. లియోన్ జేమ్స్, కీర్తన వైద్యనాథన్ గాత్రాలు సాంగ్ ని మరింత లవ్లీగా (More lovely) మార్చాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా వుంది. ఈ పాటలో హీరో, హీరోయిన్లు నారా రోహిత్, వృతి వాఘాని అలరించారు. ఈ సాంగ్ ఇన్టంట్గా కనెక్ట్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోం ది. ఆగస్ట్ 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.