ఎన్.బి.జె. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎన్.బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా త్రిశెంకినీ. (Trishenkini) ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ “మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా త్రిశెంకినీ సినిమా టైటిల్ లాంచ్ చేసుకోవడం సంతోషంగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి అన్నగారి మీద దేవుడు ఎంత ఆశీర్వాదం చూపించాడో, అంతే ఈ సినిమా మీద, మీ మీద చూపించాలని కోరుతున్నా”అని అన్నారు. నిర్మాత ఎన్. బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో ఓ సరికొత్త మూవీ చేశామని తెలిపారు. నటుడు, దర్శకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో జై జై మెగాస్టార్ అనే పాట రూపొందించాం. ఆ పాట మెగాభిమానులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కాపీ రైట్ లేదు. మీ అందరి ఆశీర్వాదంతో మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా.రాజేంద్రతో పాటు చిత్ర బృందం పాల్గొంది.