- Advertisement -
అమరావతి: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జొన్న వారి గూడెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై బైక్ ను లారీ ఢీకొంది. భార్యాభర్తలు జంగారెడ్డి గూడెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ను లారీ కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. లారీ చక్రాల కింద భార్య నుజ్జునుజ్జవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయాలయ్యిన భర్తను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: ఎస్ఐ కండకావరం… వృద్ధ మహిళపై దాడి… వీడియో వైరల్
- Advertisement -