Saturday, August 23, 2025

కారులో ధోనీ చక్కర్లు.. ఆ వాహనం ప్రత్యేకత ఏంటంటే..

- Advertisement -
- Advertisement -

రాంచీ: టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి (MS Dhoni) కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. ఆయన తన సొంత వాహనంలో చక్కర్లు కొడుతుంటారు. ఇలా చాలాసార్లు ధోనీ కెమెరా కంటికి చిక్కారు. తాజాగా తన ‘బీస్ట్’ కారులో ధోనీ చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ కారుకి ఓ ప్రత్యేకత ఉంది. ఇది పూర్తిగా ఆర్మీ థీమ్‌తో డిజైన్ చేసిన కారు. కారుపై ఫైటర్ జెట్స్, ట్యాంకర్లు, ఎయిర్‌క్రాఫ్ట్, భారత సైన్యం చిత్రాలను మనం చూడొచ్చు. దీంతో అభిమానులను ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ధోనీకి సైన్యంపై ఎంత అభిమానం ఉందో.. ఈ కారును చూస్తే తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు.

ఇక క్రికెట్ విషయంలో ధోనీకి (MS Dhoni) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కి ధోనీ గుడ్ బై చెప్పి చాలాకాలమే అయింది. కేవలం ఐపిఎల్‌లోనే అతను ఆడుతున్నాడు. దీంతో ధోనీ క్రికెట్ ఆడే రెండు నెలల కాలం కోసం అభిమానులు ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ధోనీ ప్రాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపిఎల్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. మొదలు కొన్ని మ్యాచ్‌లకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీగా వ్యవహరించినా.. అతడిని గాయం కావడంతో ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ, జట్టు ప్రదర్శనలో ఎలాంటి మార్పు లేదు. కేవలం 4 మ్యాచుల్లోనే విజయం సాధించి.. టేబుల్ చివరి స్థానంలో నిలిచింది.

Also Read : అతడిని మించిన ప్లేయర్ లేడు.. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News