Saturday, August 23, 2025

అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. ఆ టోర్నమెంట్‌కి గిల్ దూరం..

- Advertisement -
- Advertisement -

కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించడమే కాదు.. ఓ బ్యాట్స్‌మెన్‌గా అదిరిపోయే ప్రదర్శన చేశాడు యువ సంచలనం శుభ్‌మాన్ గిల్. అయితే ఇటీవల ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ అతను వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, ఈ నేపథ్యంలోనే ఓ బ్యాడ్‌న్యూస్ బయటకు వచ్చింది. దులీప్ ట్రోఫీ ఐదు రోజుల్లో, ఆసియా కప్ మరో పది రోజుల్లో ప్రారంభం అవుతుందన్న నేపథ్యంలో శుభ్‌మాన్ గిల్‌కు వైరల్ ఫీవర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గిల్‌కు రక్త పరీక్షలు నిర్వహించారని.. అందుకు సంబంధించిన రిపోర్టులు బిసిసిఐకి పంపించారని.. దీంతో దులీప్ ట్రోఫీ నుంచి గిల్‌కి విశ్రాంతి కల్పించారు. అతని స్థానంలో కెప్టెన్సీని కింఅంకిత్ కుమార్‌కి అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టులో మాత్రం వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్ కోలుకుంటాడో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా కప్ కోసం భారత్ సెప్టెంబర్ ఆరంభంలో యుఎఇకి పయనం అవుతుంది. సెప్టెంబర్ 5 నుంచి తొలి ప్రాక్టీస్ సెషన్ మొదలవుతుంది. అప్పటిలోగా గిల్ కోలుకుంటే జట్టుతో పాటు యుఎఇ వెళ్తాడు. లేకుంటే ఆసియ కప్‌కి కూడా అతను దూరమయ్యే అవకాశం ఉంది.

Also Read : ఆ కారణంతోనే వీడ్కోలు పలికా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News