హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్జేడికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. బిహార్ ఎన్నికల్లో మంచి వాతావరణం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నరో ఆయనకే తెలియదని విమర్శించారు. బిహార్ లో ఇల్లీగల్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యనే అని తెలియజేశారు.
హిమాచల్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, దొంగఓట్లతోనేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తీవ్రమైన నేరాల్లో ఉన్న సిఎం, మంత్రులు రాజీనామా (Ministers resign) చేయాల్సిందేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసిందని, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? అని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
Also read: సుధాకర్ రెడ్డి మరణం పట్ల చంద్రబాబు, రేవంత్ దిగ్భ్రాంతి