హైదరాబాద్: బిజెపి ఎంపిలు అయినప్పటికీ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని మల్కాజ్గిరి ఎంపి ఈటెల రాజేందర్ (Etela Rajender) అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు విషయంలో ఆయన శనివారం సచివాలయంలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రావాలని తాము కోరుకుంటామన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమను సంప్రదించలేదని పేర్కొన్నారు.
తమ దృష్టికి వచ్చిన కొందరు పేదల జాబితాను మంత్రికి అందించామని ఈటెల (Etela Rajender) తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం కింద ఇంటి నిర్మాణం రూ.5 లక్షలతో పూర్తి కావడం లేదని, కనీసం రూ.12 లక్షలు ఇవ్వాలని కోరారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటిలో దొంగలు పడుతున్నారని అన్నారు. జవహర్‌నగర్‌లో మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూముల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను కూల్చడం సరికాదని ఈటెల స్పష్టం చేశారు.
Also Read : అర్హులైన దివ్యాంగుల పెన్షన్షన్లు తొలగించే ప్రసక్తే లేదు: కొల్లు రవీంద్ర