Sunday, August 24, 2025

ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం మర్పు..?: కోలేటి దామోదర్

- Advertisement -
- Advertisement -

యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి కల్పించడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటూ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో యూరియాకు ఈ గోస లేదని, కాంగ్రెస్ వచ్చాక నీళ్లు లేవు, యూరియా లేదు అంటూ రైతులు వాపోతున్నారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కెసిఆర్ ఉన్నప్పుడు ఎరువులు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదని రైతులు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ రైతులకు కష్టాలు మొదలైయ్యాయని ఆయన ఆరోపించారు. వర్షాలు మొదలైనప్పటికీ ఇంతవరకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఎరువుల దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల ఆగ్రహాం నానాటి పెరుగుతూనే ఉందని తెలిపారు. పదేళ్లపాటు కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎన్నడూ యూరియా కోసం ఈ విధంగా ఎరువుల దుఖాణాల వద్ద పడిగాపులు కాయలేదని ఆయన గుర్తు చేశారు.

మళ్లీ కెసిఆర్ పాలనే రావాలని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కెసిఆర్ హయాంలో ఈ గోస లేదని, ఈ ప్రభుత్వం యూరియా ఇవ్వడం లేదని, పంట ఎప్పుడు పండాలి అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కెసిఆర్ ఇంటికి యూరియా పంపించిన రోజులు గుర్తు చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. దేవుడి దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని రైతులు చెప్పడం ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. ఓటిపి విధానం తీసివేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఓటిపి పేరిట రైతులను వేదిస్తున్న అసమర్ద ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. మళ్లీ పాతరోజులు వచ్చాయని మార్పు అంటే ఇదే అని ప్రశ్నించారు. రైతులకు యూరియా అందిచలేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News