Sunday, August 24, 2025

ఉత్తరాఖండ్ వరదల్లో యువతి మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి కొనసాగుతోంది. చమోలి జిల్లాలోని థరాలి పట్టణంలో భారీ వర్షంతో తలెత్తిన వరదల దుర్ఘటనల్లో ఓ యువతి మృతి చెందింది. మరో వ్యక్తి జాడ తెలియకుండా పోయింది. ఈ జిల్లాలో ఇప్పటి పరిస్థితి గురించి అధికారులు శనివారం ప్రకటన వెలువరించారు. భారీ వర్షంతో ఈ పట్టణం అతలాకుతలం అయింది. అనేక చోట్ల ఇళ్ల వద్ద భారీ స్థాయిలో బురద మేటలు వచ్చి చేరాయి. అనేక మార్కెట్‌లలో అడుగుతీసి అడుగు వేయడానికి వీల్లేకుండా ఉంది. ప్రజలు ఎక్కడికక్కడ బందీ పరిస్థితిని ఎదుర్కొన్నారు.పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర విపత్కర పరిస్థితుల నిర్వహణ కేంద్రం తెలిపింది.

వరద కాలువ తున్ని గధేర పొంగిపొర్లుతూ సమీపంలోని పిందార్ నదిలో ఉధృత రీతిలో చేరుకునే క్రమంలో మధ్యలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. దారి పొడవునా అనేక వాహనాలు బురదలో కూరుకుపొయ్యాయి. ఓ ప్రాంతంలో జరిగి,న దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. వరదల తీవ్రతకు ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇప్పటికీ అనేక చోట్ల పలువురి ఆచూకి లేకుండా పోయింది. పరిస్థితిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. మహిళ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News