Sunday, August 24, 2025

బ్యాట్ కోసం వెళ్లి బాలిక హత్య

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను హత్య చేసేందుకు నిందితుడు నెల రోజుల క్రితమే ప్లాన్ వేసినట్లు బయటపడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 18వ తేదీన కూకట్‌పల్లి, సంగీత్‌నగర్‌లో ఉంటున్న సహస్ర(11) ఇంట్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక ఇంటి పక్క ఇంట్లో ఉంటున్న పదోతరగతి చదువుకుంటున్న బాలుడు(14) సహస్ర తమ్ముడు స్నేహితులు. ఇద్దరు కలిసి క్రికెట్ ఆడేవారు, నిందితుడు సరిగా స్కూల్‌కు పోకుండా ఇంటి వద్దే క్రికెట్ ఆడేవాడు. సహస్ర తమ్ముడి వద్ద ఉన్న బ్యాట్‌ను తనకు ఇవ్వమని పలుమార్లు కోరినా ఇవ్వలేదు. క్రికెట్ బ్యాట్ బాగుందని చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. మొబైల్ ఫోన్‌లో క్రైం సీన్లు విపరీతంగా చూసే అలవాటు ఉన్న బాలుడు చోరీ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరైనా అడ్డు వస్తే కత్తితో ఎలా చంపేయాలనే విషయాలను ఓటిటి, యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడు.

ప్లాన్ గురించి ఓ పేపర్‌లో రాసుకున్నాడు, దానిలో భాగంగా బ్యాట్ చోరీ చేసేందుకు బాలుడు తన ఇంటి నుంచి బాలిక బిల్డింగ్‌లోకి దూకి వెళ్లాడు. ఈ సమయంలో సహస్ర టివీ చూస్తుండగా డోర్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిన నిందితుడు వంట ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. వెంటనే నిందితుడి వద్దకు వచ్చిన సహస్ర బాలుడి చొక్కాపట్టుకుని, దొంగతనం విషయం తల్లిదండ్రులకు చెబుతానని, దొంగా..దొంగా అని గట్టిగా అరిచింది. పట్టుబడుతానని భావించిన నిందితుడు బాలికను బెడ్‌పై పడేసి గొంతునులిమాడు, తర్వాత కత్తితో 20సార్లు అరవకుండా గొంతుపై పొడి చాడు. నిందితుడు గొంతు నులిముతుండగా బాలిక డాడి…డాడి అని అరిచింది. సహస్ర రక్తం మడుగులో పడి ఉండగా ఆమె ఇంట్లోనే కత్తిని కడిగి తను ఉంటున్న ఇంట్లోకి దూకి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత దుస్తులను వాషింగ్‌మిషన్‌లో వేసి ఏమి తెలియనట్లు ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో బాలుడిని తల్లి నువ్వు ఏమైనా చేశావా అని అడిగినా కూడా తాను చేయలేదని చెప్పాడు.

క్రైం ద్రిల్లర్స్ స్ఫూర్తితో…
హత్య చేసిన బాలుడు ఓటిటి, యూట్యూబ్‌లో విపరీతంగా క్రైం సీన్లు చూసే అలవాటు ఉంది. గత ఐదేళ్ల నుంచి వాటిని చూస్తున్నాడు, అందులో నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయాలు మొత్తం అందులో చూసి నేర్చుకున్నాడు. దీనికి తోడు ఇంట్లో తండ్రి తాగుబోతు కావడం, తల్లి ఒక్కతే పనిచేసి కుటుంబాన్ని పోషిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకు క్రికెట్ బ్యాట్ కావాలని అడిగినా కొనిచ్చే పరిస్థితి లేకపోవడంతో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. అడ్డు వచ్చిన వారిని ఎలా చంపివేయాలో క్రైం సీన్స్‌లో చూడడంతో దాని ఆధారంగా అడ్డువచ్చి సహస్రను చంపివేశాడు. బాలుడు పాఠశాలకు సరిగా పోకుండా గల్లీలో ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడేవాడు.

విస్కృతంగా దర్యాప్తు…
బాలిక హత్యకు గురవడంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటి, సిసిఎస్, కూకట్‌పల్లి, బాలానగర్ పోలీసులు విస్కృతంగా దర్యాప్తు చేశారు. వందలాది కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించినా ఎలాటి క్లూ లభించలేదు. అనుమానితులుగా 247మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడిని కూడా ప్రశ్నించిన పోలీసులు తర్వాత వదిలేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News