Sunday, August 24, 2025

మ్యూల్ ఖాతాలతో ఫ్రాడ్ కేసు.. సైబర్ క్రిమినల్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మ్యూల్ ఖాతాలో కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో సైబర్ క్రిమినల్ లలిత శరణ్ కుమార్‌ను శనివారం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సబంధించిన వివరాలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టిజిసిఎస్‌బి) డైరెక్టర్ శిఖాగోయొల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మ్యూల్ ఖాతాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు నేషనల్ క్రైం రిపోర్ట్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుమారు రెండు నెలల్లో ఆరు బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయల స్కాం జరిగినట్లు గుర్తించామన్నారు. వాటిలో కోట్ల రూపాయల నగదు మ్యూల్ ఖాతాలకు నిందితులు బదిలీ చేశారని తెలిపారు. 234 లింకుల ద్వారా డబ్బులు ఈ మ్యూల్ ఖాతాలకు వచ్చాయన్నారు. పలు కంపెనీలకు శరణ్ కుమార్ మ్యూల్ ఖాతాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు వడ్డేవల్లి శరణ్‌కుమార్ తరచు దుబాయ్‌ను సందర్శించి అక్కడే ఉంటున్నడన్నారు. ఖాతాదారులకు ఎజెంట్లు ఏర్పాటు చేసుకుని పలు బ్యాంకుల్లో అనేక

కరెంట్ బ్యాంక్ ఖాతాలను తెరిచి వాటితో సైబర్ మోసాలకు పాల్పడుతుండేవాడన్నారు. దర్యాప్తులో బాగంగా నిందితుడిపై ఎల్‌ఓసి నమోదు చేశామని, దీంతో నేపాల్ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తుండగా సునౌలీ చెక్‌పోస్ట్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్‌తో హైదరాబాద్‌కు తీసుకొచ్చి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో లలిత శరణ్ కుమార్‌కు సహకరించిన ఇతర నిందితుల కోసం గాలింపు జరుగుతందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న సైబర్ నెట్‌వర్క్‌తొ ఈ కేసు సంబందం కలిగి ఉందని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ మోసాలకు పాల్పడే కేటుగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపిణీ చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను ఇతరులకు అందిచవద్దని ఆమె హెచ్చరించారు. ఈ ఖాతాలను సైబర్ నేరస్తులు దుర్వినియోగం చేస్తారని, దీంతో చట్టపరమైన శిక్షకు గురికావల్సి వస్తుందని ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News