మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైడ్రా వందేళ్ళ భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని.. భవిష్యత్తు తరాలకు నీటివనరులను, ప్ర భుత్వ ఆస్తులను అందించే దిశగా ప్రణాళికలను రూపొందించుకుని ముందుకుసాగుతుందని హైడ్రా కమిషనర్ ఏవి రం గనాథ్ చెప్పారు. హైడ్రా చర్యలు తాత్కాలిక ఫలితాలనిచ్చేవి కాదనీ, శాశ్వత పరిష్కారం చేస్తున్నదనీ, మనకు మన పూర్వికులు ఇచ్చిన సహజ సంపదను.. మనం భవిష్యత్తు తరాలకు అందించేట్టుగా చర్య లు తీసుకోవడం జరుగుతుందని రంగనా థ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల యూనియన్ శనివారం నిర్వహించిన “మహానగర అభివృద్ది ఆటంకాలు” అంశంపై ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల్లోకి ఈపాటికే వచ్చిన ని ర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనీ, ఇప్పుడు చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లలోకి కొత్తగా వస్తున్న నిర్మాణాలపై చర్య లు తప్పకుండా తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం చెరువు ఖాళీ ప్రాంతాల కు కంచెలు వేస్తూ చెరువులకు రక్షణ క ల్పిస్తూ.. ఇకముందు ఆక్రమణలు, అక్ర మ నిర్మాణాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.
పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం
ప్రయోగాత్మకంగా ఆరు చెరువులను పునరుద్దరిస్తున్నామని, దశల వారిగా మిగతా చెరువులను అభివృద్ది పరుస్తామని, సిఎస్‌ఆర్ పద్దతిలో చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 900 చెరువులకుగానూ 135 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసి ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌ల హద్దులను నిర్దారించడం జరిగిందని.. మిగతా చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసేందుకు శాస్త్రీయ, సాంకేతి క పద్దతులను అనుసరిస్తున్నామనీ, సర్వే ఆఫ్ ఇండియా,ఎన్‌ఆర్‌ఎస్‌సి, విల్లేజ్ మ్యాప్‌లు, రెవెన్యూ రికార్డుల నుండి స మాచారాన్ని సేకరిస్తున్నామని త్వరలోనే మిగతా చెరువులకుకూడా ఫైనల్ నోటిఫికేషన్ జారీచేస్తామని రంగనాథ్ వివరించారు. సల్కం చెరువులోని ఫాతిమా కళాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తిస్థాయిలో సేకరిస్తున్నామని, మల్లారెడ్డి, పల్లరాజేశ్వర్‌రెడ్డికి చెందిన కళాశాలలు ఉన్న నీటి వనరులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా తీసుకుంటున్నామని, ఆ సమాచారం మేరకు చర్యలు ఉంటాయని రంగనాథ్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఒక వర్గం వారికి మెప్పుగా.. మరో వర్గం వారికి తప్పుగా హైడ్రా వ్యవహరించడం లేదనీ, హైద్రా చర్యలపై పలు రకాల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయనీ, అయినా.. చట్టం ప్రకారంగా నోటీసులు జారీచేస్తూ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం కూకట్‌పల్లి నల్లచెరువు పునరుద్దరణ చూసిన స్థానికులు హైడ్రా తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారని రంగనాథ్ తెలిపారు.
6065 శాతం చెరువుల మాయం..
హైదరాబాద్లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి గత ఏడాది జూలైలో హైడ్రా అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అకాల వర్షాల సమయంలో ముందస్తు చర్యలు చేపట్టడం, పర్యావరణ పరిరక్షణ, చెరువులు -నాలాలను రక్షించడం హైడ్రా ప్రధాన లక్ష్యమని కమిషనర్ చెప్పారు. నాలాల్లో వేలాది ట్రక్కుల పూడికతీత పనులు చేశామన్నారు. సిబ్బంది చేతనే మ్యాన్ హోల్స్, నాలాలు క్లీన్ చేయించాం.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గ్రేటర్ లో 60-65 శాతం చెరువులు మాయమయ్యాయి. పొల్యూషన్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలి. సీఎస్‌ఆర్ పేరుతో చెరువులు కొట్టేయాలని చూస్తే ఊరుకోం. చెరువుల మాదిరిగా నాలాలను కూడా నోటిఫై చేసి కబ్జాలను నిరోధిస్తాం..అని రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు. మేము చాలా తెలుసుకోవాల్సి ఉంది. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ, భాగానే పనులు చేస్తున్నాం. తప్పులు జరిగితే వాటిని సమీక్షించుకుంటాం అని ఆయన అన్నారు.
500 ఎకరాలను కాపాడినాం..
హైడ్రా అధికారాలతో బతుకమ్మ కుంట, కూకట్పల్లి చెరువుల అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత స్థానికులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైడ్రా ఏర్పడి సంవత్సరం పూర్తయిందని, ఇప్పటి వరకు 500 ఎకరాలను కాపాడగలిగామని చెప్పారు. ప్లాట్స్, ఫ్లాట్స్ కొనేవారు ఇప్పుడు అన్ని పత్రాలు ఉన్నా.. హైడ్రా నుంచి అప్రూవల్ తీసుకున్నారా లేదా..? అనేది అడుగుతున్నారంటే హైడ్రా ఎఫెక్ట్ ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చని రంగనాథ్ చెప్పారు. హైదరాబాద్‌లో భూముల క్రయ విక్రయాల విషయంలో ఇప్పుడు హైడ్రా పేరు తప్పనిసరిగా వినిపిస్తోందన్నారు.
ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. గతంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) పేరుతో కొందరు ఆక్రమణలు చేసేందుకు ప్రయత్నించారు. వాటిని సాంకేతిక ఆధారాలతో ఎఫ్‌టీఎల్ సరిహద్దులు ఖరారు చేస్తున్నామని తెలిపారు. నాలాలను అధికారికంగా నోటిఫై చేయడం ప్రారంభమైందని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్లూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధానకార్యదర్శి రామనారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మేడ్చెల్ బ మల్కజిగిరి జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, సీనియర నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చర్చలు ఇలా..
ప్రెస్ క్లబ్‌కు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మనతెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్, ఐజెయు నేతలు వై. నరేందర్‌రెడ్డిలు తేనీటి విందు ఇచ్చారు.యూనియన్ కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో వీరంతా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లోని నీటి వనరుల సమస్యలు, సవాళ్ళుపై చర్చించారు. పలు సూచనలు, సలహాలు, చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్‌తో మాట్లాడారు.