Sunday, August 24, 2025

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ

- Advertisement -
- Advertisement -

సభ్యులుగా భట్టి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్క
న్యాయనిపుణులతో చర్చించి 26లోగా కమిటీ నివేదిక
నివేదికలోని అంశాల ఆధారంగా 29న కేబినెట్‌లో చర్చించి
నిర్ణయం స్థానిక ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు
పెంచుతూ బిల్లు తెచ్చాం స్థానికంలో రిజర్వేషన్లు
50శాతం దాటకుండా కెసిఆర్ చట్టం తెచ్చారు కెసిఆర్
సృష్టించిన అడ్డంకిని తొలగించడానికే ఆర్డినెన్స్ తెచ్చాం
ఆర్డినెన్స్, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద
పెండింగ్‌లో ఉన్నాయి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న
బిల్లులపై న్యాయపోరాటం ఓట్‌చోరీపై బీహార్‌లో
రాహుల్ నిర్వహిస్తున్న పాదయాత్రలో 26న పాల్గొంటాం :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడున్నర గంటల
పాటు సాగిన పిఎసి సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని, సాధించేందుకు సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనికి ఇద్దరు సీనియర్ న్యాయవాదులను నియమించాలని నిర్ణయించింది. ఇంకా స్థానిక సంస్థల పై ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ఉ ప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్కతో కమిటీని నియమించిం ది. ఈ కమిటీ ఈ నెల 26వ తేదీలోగా నివేదిక సమర్పించాలని, దానిపై 29న జరిగే మంత్రివ ర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు. శనివారం గాంధీ భవన్ లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్,

ఇంకా పిఏసి సభ్యులు ష బ్బీర్ అలీ, వి. హనుమంత రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యా రు. మూడున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో బిసి రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. బిసి రిజర్వేషన్లను అనుకున్న విధంగా సాధించలేకపోతే పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఓట్ చోర్, గద్దీ చోడ్ పేరిట రూ పొందించిన పోస్టర్‌ను సిఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతృత్వంలో ని ‘ఇండి’ కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసిసి అధ్యక్షుడుమల్లికార్జున ఖర్గేకు,

ఏఐసిసి అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడేందుకు పని చేశారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశానుసారం రాష్ట్రంలో కుల గణన చేపట్టామని ఆయన వివరించారు. బిసిలకు విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడిగా మరో బిల్లు తీసుకుని వచ్చామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చట్టం తెచ్చారని ఆయన విమర్శించారు. ఈ అడ్డంకిని తొలగించడానికి మంత్రివర్గం ముసాయిదా ఆర్డినెన్స్‌ను ఆమోదించిందని అన్నారు. కెసిఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్స్ తెచ్చామని, దానిని గవర్నర్ కేంద్రానికి పంపించారని ఆయన వివరించారు.

ఇద్దరు న్యాయవాదుల నియామకం
బిసి రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ మాట నిలబడాల్సిందే, బిసిలకు మేలు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ అ న్నారు. కెసిఆర్ తెచ్చిన చట్టం ప్రకారం బిసిలకు ఒక్క శా తం రిజర్వేషన్ కూడా రాదన్నారు. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపై సుప్రీం కో ర్టులో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించామని ఆయన వివరించా రు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిసి బిల్లు అంశం కూడా ప్రస్తావనకు వస్తుందన్నారు. విడిగా సుప్రీం కోర్టుకు వెళితే కేసు లిస్ట్ కావడానికి చాలా సమయం పడుతుందన్నారు.

రాహుల్ పాదయాత్రలో పాల్గొంటా..
ఓట్ చోరీ…గద్దీ చోడ్ పేరిట రాహుల్ గాంధీ ఈ నెల 26న బిహార్‌లో నిర్వహించనున్న పాదయాత్రలో తానూ పాల్గొంటానని ఆయన తెలిపారు. యూరియా కొరతపై బిజెపి, బిఆర్‌ఎస్ కలిసి డ్రామా చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. యూరియా ఇచ్చే పార్టీకి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు చెప్పడంతో వారి తీరు ఏమిటో అర్థమైందన్నారు. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రు లు జెపి నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిసామని ఆయన తెలిపారు. యూరియా పంపిణీపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్ష ణ అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

న్యాయ పోరాటానికి సిద్ధం..
సమావేశానంతరం మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధన కోసం సుప్రీం కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపైనా న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, మాజీ న్యా యమూర్తి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాలనూ తీసుకుంటామని వారు చెప్పారు. ఓట్ చోర్…గద్దీ చోడ్ అనే నినాదంతో రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని పార్టీ సమావేశంలో నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాలని వారు ఈ సమావేశంలో భావించారు.

దీనికి సరైన ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళాలని, ఆధారాలూ చూపించాలని నిర్ణయించారు. యూరియాపై బిఆర్‌ఎస్, బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా రెండు వారాల్లో నియమించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. అయితే ఈ సమయంలో ముఖ్యమంత్రి కల్పించుకుని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిపైనే అధిక భారం ఉందని అన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News