Sunday, August 24, 2025

’కట్టలన్’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మార్కో పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్‌పై ప్రొడ్యూసర్ షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ కట్టలన్ (Kattalan) ను లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో అద్భుతంగా జరిగింది. బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు పూజా కార్యక్రమంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈవెంట్‌లో యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్, హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ లాంటి స్టార్‌లు హాజరై (Stars attendance) గ్లామర్‌ని మరింత పెంచారు. సుమారు రూ. 45 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ టైటిల్ పోస్టర్ ఇప్పటికే వైరల్ అయ్యింది. డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, కాంతార, మహారాజా సినిమాలతో సౌత్‌లో సంచలనం సృష్టించిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News