జనగామ: జఫర్‌ఘడ్ ఎస్సై రామ్ చరణ్ నాయక్ అరాచకానికి పాల్పడ్డాడు. తనకు లంచం (Bribe) ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రక్తం వచ్చేలా చితకబాదించాడు. చిన్నపాటి గొడవను ఆపిన ఉమర్ అనే వ్యక్తిపై ఎస్సై కేసు పెట్టాడు. రూ.10 వేలు లంచం ఇస్తే కేసు తీసేస్తామని బెదిరించాడు. తాను చెప్పులు అమ్ముకునే వ్యక్తినని.. తన దగ్గర అంత డబ్బు లేదని ఉమర్ చెప్పాడు. దీంతో కానిస్టేబుల్‌తో బాధితుడిని రక్తం వచ్చేలా కొట్టించాడు ఎస్పై రామ్ చరణ్.
గతంలో ఓ స్థలం వివాదంలో కూడా రామ్ చరణ్ డబ్బులు (Bribe) డిమాండ్ చేశాడని ఉమర్ తెలిపాడు. అన్ని విషయాలు మనస్సులో పెట్టుకొని ఎస్సై ఈ దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నాడు. ఎస్సై నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించారని ఉమర్ విజ్ఞప్తి చేశాడు. బాధితుడు ఉమర్ ప్రస్తుతం రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరి ఉన్నతాధికారులు ఎస్సై రామ్ చరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Also Read : ఢిల్లీ వర్సిటీలో సీటు సాధించిన కొడుకు.. ఫీజు చెల్లించలేక ఆదుకోవాలని తల్లి వేడుకోలు