Sunday, August 24, 2025

రాజకీయాల్లోకి వస్తే నన్నెవరూ ఆపలేరు: నారా రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్‌లో హీరోగా సెటిల్ అయిన నటుడు నారా రోహిత్ (Nara Rohith). తొలి సినిమా నుంచే తన యాక్టింగ్‌తో రోహిత్ మంచి ప్రేక్షకాదరణను పొందారు. ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ లేకపోయినా.. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. నారా రోహిత్ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు సొదరుడు రామమూర్తి నాయుడు కుమారుడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి రోహిత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తన లేటెస్ట్ చిత్రం ‘సుందరకాండ’ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా తన (Nara Rohith) రాజకీయ ప్రవేశంపై ఆడిగిన ప్రశ్నకు ‘‘నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను.. రాజకీయాల్లోకి వస్తే నన్ను ఎవరూ ఆపలేరు. ఆ రోజు వస్తే మీ అందరకీ చెప్పే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను’’ అని సమాధానం ఇచ్చారు. ఇక సుందరకాండ సినిమా విషయానికొస్తే.. సుందరకాండ ఓ విభిన్నమైన కథతో తెరకెక్కింది. రొమాంటిక్-కామెడీ సినిమాగా తెరకెక్కిన ఇందులో శ్రీదేవీ విజయకుమార్, వృతి వాహినీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన విడుదల కానుంది.

Also Read : బ్యూటీఫుల్ లవ్ సాంగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News