- Advertisement -
హైదరాబాద్: చందానగర్ పాపిరెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. రైల్వే వంతెన కింద నిలిచిన నీటిలో పడి యువకుడు మృతి చెందాడు. చందానగర్ లో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద కొన్నాళ్లుగా నీరు నిలిచిపోయింది. యువకుడు అటుగా వెళ్తూ నీటమునిగి చనిపోయాడని అనుమానం చెందగా, అండర్ పాస్ లో 45 రోజులుగా ఉన్న నీటిని తోడిపోయలేదని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుడి మృతికి గల కారణం జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యమే అని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -