ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు పలువురు బలి అవుతున్నారు. మారుతున్న జీవనశైలీ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మామూలుగా ఉంటూనే ఒక్కసారి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి మరణించిన వాళ్లు ఈ మధ్య చాలా మందినే చూశాం. తాజాగా హాలీవుడ్లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ (Diego Borella) కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
‘ఎమిలీ ఇన్ పారిస్’ అనే వెబ్‌సిరీస్‌ను ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తోంది. ఈ సిరీస్ ఐదో సీజన్ ఇటలీలోని వెనిస్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సిరీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా డియోగో బోరెల్లా (47) (Diego Borella) పని చేస్తున్నాడు. అయితే గురువారం సాయంత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు 1 గంటల సమయంలో డియోగో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ పని చేస్తున్న మిగితా వ్యక్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్పాట్లోనే డియోగో కన్నుమూశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ మృతితో తాత్కాలికంగా షూటింగ్‌ను నిలిపివేశారు.
Also Read : ‘ఘాటి’లో నాది ఐకానిక్ పాత్ర అవుతుంది