టీం ఇండియా టెస్ట్ ఫార్మాట్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్‌మెంట్ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. వీరిద్దరు లేకుండానే భారత్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి అక్కడ సిరీస్‌ని సమం చేసుకొని తిరిగి వచ్చింది. అయితే రో-కోల రిటైర్‌మెంట్ షాక్‌లో ఉన్న అభిమానులకు మరో షాక్ తగిలింది. అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.
‘‘భారత జెర్సీ ధరించి ప్రతీ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఆలపించడం నాకు ధక్కిన అరుదైన గౌవరం. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాను. నా ఈ ప్రయాణాన్ని మాటల్లో చెప్పలేను. ఎప్పటికైన, ఎంతటి మంచి విషయానికైనా ముగింపు పలకాల్సిందే. కాబట్టి ఈ రోజు భారత క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నా క్రికెట్ కెరీర్‌లో నాకు సపోర్ట్ చేసిన బిసిసిఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే నేను ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీ క్రికెట్ జట్ల యాజమాన్యాలకు, కౌంటీ క్లబ్‌లకు, నా సహచరులకు, కోచ్‌లకు, సపోర్టింగ్ స్టాప్‌కు, నెట్ బౌలర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజ్ కోట్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన నాకు భారత క్రికెట్ ఎంతో ఇచ్చింది’’ అని పుజారా (Cheteshwar Pujara) పేర్కొన్నారు.
2010, ఆగస్టు 9న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఛతేశ్వర పుజారా అరంగేట్రం చేశారు. ఆయన తన కెరీర్‌లో 103 టెస్టులు ఆడి 43.60 సగటుతో 7195 పరుగులు చేశారు. అందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయ. 2013లో వన్డేల్లో అరంగేట్రం చేసి పుజారా కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడి.. అందులో 51 పరుగులు చేశారు.
Also Read : క్లీన్ స్వీప్‌పై సౌతాఫ్రికా కన్ను