- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ గెలిపించిన ఎమ్మెల్యేలు పార్టీని వీడివెళ్లారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) మండిపడ్డారు. హైదరాబాద్ లో ఒక్కచోట కూడా కాంగ్రెస్ జెండా ఎగరలేదని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో ఉపఎన్నికల్లో గెలిచే దమ్ము ఎమ్మెల్యేలకు ఉందా? అని 20 నెలల్లో ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఏం అభివృద్ధి చేశారు? అని నిలదీశారు. ఎవరి అభివృద్ధి కోసం అరికెపూడి పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ఎమ్మెల్యేకు ధైర్యం లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారు.
- Advertisement -