Sunday, August 24, 2025

ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు: భూమన

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిటిడి భూములను కాపాడాల్సిన బాధ్యత ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు లేదా? అని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ప్రశ్నించారు. టిటిడికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరం అని అన్నారు. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ..టిటిడి స్థలాన్ని టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు? అని చంద్రబాబు నాయుడు, టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా (commercial terms) మార్పిడి చేస్తున్నారని, వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకుంటారా? అని మండిపడ్డారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, అత్యంత పవిత్రమైన ల్యాండ్ ను టూరిజానికి ఇవ్వడమేంటీ? అని నిలదీశారు. దీనిపై పీఠాధిపతులు, సాధువులు, స్వామిజీలు స్పందించాలని భూమన కరుణాకర్ రెడ్డి  పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News