Monday, August 25, 2025

‘నేను మలయాళీ కాదు..’ ట్రోల్స్‌కి ధీటుగా జవాబిచ్చిన జాన్వీ

- Advertisement -
- Advertisement -

అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘పరమ్ సుందరి’. ఈ సినిమాలో ఆమె మలయాళీ అమ్మాయిగా కనిపించనుంది. అయితే ఈ విషయంపై ట్రోల్స్ పుట్టుకొచ్చాయి. ఉత్తరాదికి చెందిన జాన్వీ కపూర్‌ని కేరళ అమ్మాయిగా చూపించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మలయాళీ అమ్మాయిగా నటించేందుకు కేరళ హీరోయిన్లు ఎవరు దొరకలేదా? అని సింగర్ పవిత్ర మేనన్ లాంటి వాళ్లు విమర్శించారు. వీటన్నిటికీ జాన్వీ ధీటుగా జవాబిచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై జాన్వీ స్పందించింది.

‘‘నేను మలయాళ అమ్మాయిని కాదు. మా అమ్మ(శ్రీదేవి) కూడా మలయాళీ కాదు. అయినా కేరళ సంస్కృతి పట్ల నాకు ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా మలయాళ సినిమాలకు నేను అభిమానిని. ఈ చిత్రంలో (పరమ్ సుందరి) నేను మలయాళ అమ్మాయిగానే కాదు.. తమిళ అమ్మాయిగా కూడా కనిపిస్తాను. ఇది ఒక వినోదాత్మక చిత్రం. నేను ఈ సినిమాలో భాగం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని జాన్వీ (Janhvi Kapoor) తెలిపింది.

ఇక ఈ సినిమాలో హీరోగా సిద్ధార్త్ మల్హోత్రా నటిస్తున్నాడు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ట్రైలర్ చివర్లో జాన్వీ దక్షిణాది హీరోల గురించి చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : సూపర్ యోధ అవతార్ లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News