Monday, August 25, 2025

హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ వృద్ధి అతలాకుతలం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర అభివృద్ధి అతలాకుతలమైందని కెటిఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్‌లో సిఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా..? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చి వేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్‌ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో నాయకులు వేలు పెట్టలేదని, కబ్జాలు, గూండాగిరి చేయలేదని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News