Monday, August 25, 2025

‘గగన్‌యాన్ మిషన్’.. ఓ కొత్త అధ్యాయం: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో గగన్‌యాన్ మిషన్ ఒక ‘కొత్త అధ్యాయం’ని సూచిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అన్నారు. వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఎంపికైన మరో ముగ్గురు గగన్‌యాన్ యాత్రికులు దేశ ‘రత్నాలు’, జాతీయ ఆకాంక్షలకు మార్గదర్శకులుగా అభివర్ణించారు. సుబ్రోతో పార్క్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నలుగురు గగన్ యాత్రికులను సత్కరించారు. శుక్లా జట్టు సభ్యుడిగా ఉండి, భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయవంతమైన ‘ఆక్సియం 4 మిషన్’ తర్వాత ఈ వేడుక జరిగింది. తక్కువ వనరులు ఉన్నప్పటికీ మన దేశం చంద్రయాన్ మొదలుకుని మంగళ్‌యాన్ వరకు అనేక మిషన్‌లు నిర్వహిస్తోందని ఆయన అన్నారు.

నలుగురు గగన్‌యాత్రికులుగా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజీత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎంపికైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామి శుక్లా. ఆక్సియం మిషన్ 4 లో భాగంగా 20 రోజుల అంతరిక్ష పర్యటన తర్వాత, ఇతర తోటి ఖగోళ యోమోగాములతో ఆయన గత నెలలో భూమికి తిరిగి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News