Monday, August 25, 2025

కాంగ్రెస్ ఒబిసి సైద్ధాంతిక కమిటీలో కంచ ఐలయ్యకు స్థానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కాంగ్రెస్ పార్టీ ఒబిసి సైద్ధాంతిక కమిటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు స్థానం లభించింది. ఒబిసి రిజర్వేషన్ల పెంపు, బిసి నినాదం, కుల గణన లక్షంతో కాంగ్రెస్ ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఒబిసి విభాగం చైర్మన్ డాక్టర్ అనిల్ జైహింద్ ఆదివారం 23 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జాతీయ కన్వీనర్‌గా ప్రొఫెసర్ సుధాంశు కుమార్‌ను నియమించారు. ఈ కమిటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను నియమించారు. కమిటీలో దేశంలోని 23 మంది మేధావులను నియమించినట్లు చైర్మన్ డాక్టర్ అనిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒబిసిల రిజర్వేషన్లు, హక్కులు బిసి రిజర్వేషన్ల పెంపు, కులగణన లక్షంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ ఒబిసి మేధావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడంతో మరో అడుగు ముందుకేసినట్లు అయ్యిందని పార్టీ నేతలు సంతోషిస్తున్నారు.

నేను కాంగ్రెస్ సభ్యున్ని కాదు..
తాను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ జాతీయ ఒబిసి సైద్ధాంతిక కమిటీ సభ్యుడిగా నియమితులైన సందర్భంగా ఆయన మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. దేశంలో మెజారిటీ జనాభా కలిగిన ఒబిసిల తరపున ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం తనను ఆకట్టుకున్నదని, ఈ పోరాటం ఒబిసిలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో వారికి సముచితమైన వాటా దక్కుతుందన్న నమ్మకంతో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News