Monday, August 25, 2025

ఆటకు అల్విదా.. క్రికెట్‌కు పుజారా వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

ముంబై: ద్రవిడ్ వారసుడిగా భారత టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టి నయావాల్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుఎన్నాడు. అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన పుజా రా.. టీమిండియా నయావాల్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడిస్తూ పుజారా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తన కెరీర్‌కు అండగా నిలిచిన అభిమానులకు, బిసిసిఐ, సౌరా ష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లకు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇండియా జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం నా వంతుగా అత్యుత్తమ ప్రదర్శనలతో రాణించడం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు.

అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిందే. అన్ని ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి రిటై ర్ కావాలని నిర్ణయించుకున్నా’ అని భావోద్వేగపు పోస్ట్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఫ్రాంచై జీ, కౌంటీ క్రికెట్ ప్రతినిధులు, మెంటార్, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురు.. అందరికీ ధన్యవాదాలు. సహచర క్రికెటర్లు, సపోర్ట్ స్టాఫ్, నెట్ బౌలర్లు, అనలిస్ట్‌లు, లాజిస్టిక్‌లు, అంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్, స్కోరర్లు మీడియా పర్సనల్, స్పాన్సర్లు.. ఇలా అందరీ ప్రోత్సాహం మరువలేనిది. నా కుటుంబ సభ్యులు, నా సతీమణి పూజ, కూతురు అదితి, స్నేహితులందరూ నాకు అండగా నిలిచారు. ఇక ఈ సమయం నా కుటుంబంతో గడపటానికే ప్రయత్నిస్తా.’అని పుజారా పేర్కొన్నాడు.

మూడు డబుల్ సెంచరీలు..
20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న పుజారా.. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 103 టెస్ట్‌లు ఆడి 7,195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా 51 పరుగులే చేశాడు. భారత్ తరఫున చివరిసారిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన పుజారా మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా పుజారా కూడా ఈ జాబితాలో చేరాడు. అజింక్యా రహానే ఒక్కడే మిగిలాడు. అతను కూడా తప్పుకుంటే టెస్ట్‌ల్లో ఓ శకం ముగిసినట్టవుతుంది.

500 బంతులు..
టెస్ట్ క్రికెట్‌లో పుజారా ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను, రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్‌ను అందుకున్నాడు. 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లోనూ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. 2013లో ఐసిసి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, 2018లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 500 బంతులు ఎదుర్కొన్న ఏకైక ఆటగాడిగా పుజారా రికార్డు నెలకొల్పాడు.

ఐదు రోజులు బ్యాటింగ్..
సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలకు సా ధ్యం కానీ రికార్డ్‌ను పుజారా సాధించా డు. అంతేకాకుండా గత 40 ఏళ్లలో టెస్ట్ క్రికెట్‌లో ఐదు రోజులూ బ్యాటింగ్ చేసి న తొలి భారత ఆటగాడిగా కూడా పుజా రా చరిత్ర సృష్టించాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన భారత ఆటగాడిగా కూడా పుజారా ఘనతను అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో పుజారా మాత్రమే 1258 బంతులు ఎదుర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News