నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం
తల్లిగారింట్లో ఉంటున్న శ్రావణిని నమ్మించి తీసుకెళ్లిన భర్త శ్రీశైలం
మన తెలంగాణ/కొల్లాపూర్: కట్టుకున్న భార్యను హతమార్చి అడవిలో కాల్చివేసిన భర్త సంఘటన నాగర్‌కర్నూ ల్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. లింగాల మండలం, కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం 2014లో మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థ్థలు ఉండడంతో శ్రావణి మహబూబ్‌నగర్‌లో పిల్లలతో ఉంటోంది.
ఈ నెల 21న శ్రీశైలం మహబూబ్‌నగర్ వెళ్లి బైక్‌పై సోమశిలకు వెళ్దామని భార్యకు మాయమాటలు చెప్పాడు. పెద్దకొత్తపల్లి మండలం, సాతాపూర్, మారేడుమాన్‌దిన్నె అటవీ ప్రాం తంలో ఆమెను హత్య చేసి కాల్చి వేశాడు. తమ కుమార్తె కని పించకపోవడంతో తండ్రి మమబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. శ్రావణిని తానే చంపానని హ త్య చేసిన స్థలాన్ని చూపించాడు. హతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.