Monday, August 25, 2025

గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో ముందడుగు

- Advertisement -
- Advertisement -

ఎయిర్ డ్రాప్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆదివారం అత్యద్భుత రీతిలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టు (ఐఎడిటి 01)ను నిర్వహించింది. గగన్‌యాన్ దశలో అత్యవసరం అయ్యే పారాచూట్‌ల ద్వారా నేలవాలే ఈ డ్రాప్ సిస్టమ్ పనితీరును ఇస్రో సాంకేతిక విభాగం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వద్ద పరీక్షించింది. ఈ విన్యాసాన్ని ఇస్రో, భారతీయ వాయుదళం, డిఆర్‌డిఒలు సంయుక్తంగా నిర్వహించాయి. భారతీయ నావికాదళం, భారతీయ తీర ప్రాంత రక్షణ దళం కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకుందని అధికార వర్గాలు తెలిపాయి.

భారతదేశం 2027లో మానవుడిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లి, తిరిగి భూమిపైకి సురక్షితంగా చేర్చే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టును ఇస్రో పర్యవేక్షణలో చేపట్టింది. ఇది దేశానికి తొలి మానవయుత అంతరిక్ష యాన కార్యక్రమం. ఇది విజయవంతం అయ్యేందుకు పారాచూట్ వాడకం కీలకం అవుతుంది. మనుషులను తీసుకువెళ్లే, కిందికి తీసుకువచ్చే మాడ్యూల్ భూవాతావరణం నుంచి దాటి వెళ్లేటప్పుడు, ఈ భూ కక్షలోకి చేరుకునే దశలో వేగం, సమన్వయం కల్పించుకునే క్రమంలో పారాచూట్‌ల డ్రాప్ విధానం అత్యవసర అంతర్భాగం అవుతుంది. ఈ వ్యవస్థ పనితీరును ఇప్పుడు విజయవంతంగా పరీక్షించడం ఇస్రో పరిశోధనల దిశలో కీలకం అయింది. క్రూ మాడ్యుల్‌కు ఈ పారాచూట్ సంబంధిత ఎయిర్ డ్రాప్ టెస్టు ప్రధానమైనది. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News