Monday, August 25, 2025

సముద్రం నేపథ్యంలో మాఫియా కథ

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ హీరో విశాల్ (Vishal) ప్రస్తుతం 35వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సూపర్ గుడ్ ఫిలమ్స్ బ్యానర్ మీద ఆర్‌బి చౌదరి 99వ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంతవరకు విశాల్ 35 అంటూ ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక ఆదివారం ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను తెలియజేస్తూ టీజర్‌ను విడుదల చేశారు. విశాల్, అంజలి, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ‘మకుటం’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ మేరకు వదిలిన టీజర్‌ను గమనిస్తే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ (mafia story) అని అర్థం అవుతోంది. సముద్రం లోపలి జీవరాశుల్ని చూపిస్తూ.. చివరగా విశాల్‌ను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ‘మకుటం’ చిత్రంలో విశాల్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News