‘ఈటీవీ విన్’లో విడుదలైన కానిస్టేబుల్ కనకం, (Constable Kanakam) ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్రాలు అద్భుతమైన విజయంతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. ప్రతి చిత్రం రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ‘కానిస్టేబుల్ కనకంతో ఈటీవీ విన్‌లో భాగం కావడం ఆనందంగా వుంది. ఒక ట్రూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తీశారు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
డైరెక్టర్ ప్రశాంత్‌కి థాంక్ యూ. సిరిస్‌కి అద్భతమైన స్పందన వస్తోంది. పార్ట్2 కూడా రాబోతుంది’ అని అన్నారు. ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ ‘హ్యాట్రిక్ సక్సెస్ (Hattrick success) జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆగస్టు 29 ప్రపంచ తెలుగు దినోత్సవం. దీన్ని ఎవరు జరుపుకోవడం లేదు. ఈటీవీ విన్ నుంచి మేము దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఇది తెలుగు వినోదోత్సవం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ సాయిబాబా, బివిఎస్ రవి, తదితరులు పాల్గొన్నారు.