Monday, August 25, 2025

అద్భుతమైన మెలోడీ పాట

- Advertisement -
- Advertisement -

నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య ముఖ్య తారాగణంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. (Bad Girls) ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుంచి ’ఇలా చూసుకుంటానే’ మెలోడీ పాటను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు. పాట విని అద్భుతంగా ఉంది అని కొనియాడారు.

అనూప్ రూబెన్స్ సంగీతంలో విడుదల అయినా ‘ఇలా చూసుకుంటానే’ పాటను ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించగా (Literature provided) సిద్ శ్రీరామ్ పాడారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ‘ మా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంలో మొదటి పాట ‘ఇలా చూసుకుంటానే’ను రానా దగ్గుబాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన మెలోడీ పాట. ‘నీలి నీలి ఆకాశం’ పాట సీక్వెల్‌గా అంతకన్నా గొప్పగా ఉంటుంది. ఈ పాట అంతా జమ్మూ కాశ్మీర్, మలేషియా ప్రకృతి అందాలలో చిత్రీకరించాము. అనూప్ రూబెన్స్ అద్భుతమైన భాణీ అందిస్తే సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిగా వినోద భరిత చిత్రం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News