Monday, August 25, 2025

ఆసియాకప్‌కి ముందు చితక్కొట్టిన సంజూ.. అదిరిపోయే సెంచరీ

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson) మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. ఆసియాకప్‌కి ముందు తనేంటో చాటి చెప్పాడు. కేరళ క్రికెట్‌ లీగ్‌లో అదిరిపోయే సెంచరీ సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. కెసిఎల్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజూ ఆదివారం అరైస్ కొల్లాం సైలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హధ్దుగా చెలరేగిపోయాడు.

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే సంజూ (Sanju Samson) దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే అర్థశతకం సాధించి.. కెసిఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆ తర్వాత 42 బంతుల్లో సెంచరీ సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదురుకున్న సంజూ 14 ఫోర్లు, 7 సిక్సులతో 121 పరుగులు చేశాడు. అయితే బిజు నారాయణ్ బౌలింగ్‌లో సంజూ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొచ్చి ఇన్నింగ్స్ కాస్త స్లో అయింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. కొచ్చి బ్యాట్స్‌మెన్ మహమ్మద్ ఆషిక్ తొలి రెండు బంతుల్లో ఫోర్‌, సిక్సు సాధించాడు. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం ఉన్న సమయంలో ఆషిక్ సిక్సు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో సెంచరీతో కొచ్చి విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఆసియా కప్‌లో తనని ఓపెనర్‌గా పంపించవచ్చని.. టీం ఇండియా మేనేజ్‌మెంట్‌కి ఈ ఇన్నింగ్స్‌తో సంజూ సందేశం ఇచ్చాడు. మరోవైపు శుభ్‌మాన్ గిల్‌కి జట్టులో చోటు దక్కడంతో సంజూకి తుది జట్టులో చోటు లభిస్తుందో.. లేదో.. అనే సందేహం కూడా ఉంది.

Also Read : ఆసియా కప్‌కు అఫ్ఘనిస్థాన్ జట్టు ప్రకటన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News