Monday, August 25, 2025

మరో వెబ్ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ.. రూటు మార్చేసిందా..?

- Advertisement -
- Advertisement -

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒటిటిల హవా నడుస్తోంది. పలువురు స్టార్లు ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన తమన్నాకు (Tamannah) ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ భామ తన దృష్టి మొత్తం వెబ్‌ సిరీస్‌పైనే పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పలు వెబ్‌సిరీస్‌లో నటించిన తమన్నా.. త్వరలో మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది.

‘డు యు వానా పార్ట్‌నర్’ అనే వెబ్‌సిరీస్‌తో తమన్నా (Tamannah) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌లో తమన్నాతో పాటు బాలీవుడ్ నటి డయానా పెంటీ కూడా నటిస్తోంది. నందిని గుప్త, ఆర్ష్, మిథున్ గంగోపాధ్యాయ ఈ సిరీస్‌‌‌‌‌ని రచించారు. నిషాంత్ నాయక్, గంగోపాధ్యాయలు దర్శకత్వం వహించారు. ఇద్దరు యువతుల మధ్య ఉండే స్నేహం. ఆ తర్వాత వాళ్లు ఎదురుకొనే సవాళ్లును ఈ సిరీస్‌లో చూపించనున్నారు. ఈ సిరీస్ ఒటిటిలో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read : సినిమా రంగానికి ఒక పాలసీ అవసరం: సిఎం రేవంత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News