Monday, August 25, 2025

ప్రపంచకప్‌కి పాక్ జట్టును ప్రకటించిన బోర్డు

- Advertisement -
- Advertisement -

2025 ఐసిసి మహిళల ప్రపంచకప్‌ (Women World Cup 2025) మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ప్రతిష్టాత్మకమైన ఆక భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తాజాగా ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి ఆల్ రౌండర్ ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఐసిసి టోర్నీలో పాకిస్థాన్‌కు సనా కెప్టెన్‌గా ఉండటం ఇదే తొలిసారి.

అదేవిధంగా నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమా్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్‌లు తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్నారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో (Women World Cup 2025) పాకిస్థాన్ అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. ఆక్టోబర్ 5న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News