బెంగళూరు: అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఘాటి’ (Ghaati). ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కర్ణాటక రిలీజ్ హక్కులను కన్నడ స్టార్ హీరో యశ్ తల్లి పుష్ప దక్కించుకున్నారు. పుష్ప కొద్ది రోజుల క్రితమే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన భర్త అరుణ్ కుమార్‌తో కలిసి ఆమె PA ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ మధ్యకాలంలోనే ‘కొత్తలవాడి’ అనే కన్నడ చిత్రాన్ని ఈ బ్యానర్‌పై నిర్మించి విడుదల చేశఆరు. ఇప్పుడు అనుష్క నటించిన ఘాటి సినిమా కర్ణాటక రిలీజ్ హక్కులను ఆమె సొంతం చేసుకున్నారు.
ఇక ఘాటి (Ghaati) సినిమా విషయానికొస్తే.. కొండ ప్రాంతంలో నివసించే ప్రజల చుట్టూ, మాదకద్రవ్యాల చుట్టు తిరిగే కథ ఇది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : సముద్రం నేపథ్యంలో మాఫియా కథ