హైదరాబాద్: పుష్ప సినిమాల తర్వాత అల్లు అర్జున్‌కి దేశవ్యాప్తంగా స్టార్డమ్ వచ్చింది. దీంతో అల్లు అర్జున్ నుంచి వచ్చే సినిమాలపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో (AA22 X A6) ఓ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతికతతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని సన్ ఫిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. అయితే సాధారణంగా ఓ సినిమా కోసం పని చేసే వ్యక్తి కనిపిస్తే.. ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ కచ్చితంగా అడుగుతారు. దీంతో అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం పని చేస్తున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాస్‌కి కూడా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ గురించి ప్రశ్న ఎదురైంది.
‘కన్యాకుమారి’ అనే చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో బన్నీ వాస్ని అల్లు అర్జున్ కొత్త సినిమా (AA22 X A6) గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా అని ప్రశ్నించారు. దీంతో ఆయన ‘‘సన్ పిక్చర్స్ సంస్థతో నాకు నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. ఏదైనా చెబితే వాళ్లే చెప్పాలి. ప్రస్తుతం నేను ఏమీ మాట్లాడలేను’’ అని సమాధానం ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు ఒకింత నిరాశే మిగిలింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్లో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకోసం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నారు. అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read : అద్భుతమైన మెలోడీ పాట